Maintenance Tips for Road Master & Earth Master - Mahindra Construction Equipment
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 


మెయింటెనెన్స్ చిట్కాలు

మెయింటెనెన్స్ చిట్కాలు

  1. ఎయిర్ లాక్ సమస్య రాకుండా ఉండేందుకు, ఎల్లప్పుడూ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ యొక్క 30%కి పైన ఫ్యూయెల్ లెవల్ ని మెయింటెయిన్ చెయ్యండి.
  2. ఎయిర్ ట్రాప్ కారణంగా ఇంజన్ తరచూ ఆగిపోతూ ఉంటే, ఫ్యూయెల్ ఫిల్టర్ లేదా వాటర్ సెపరేటర్లు చోక్ అయ్యాయా అని లేదా సక్షన్ లైన్ లూజుగా ఉందా అని చూడండి. ఎయిర్ బ్లాకేజ్ ని తొలగించేందుకు, ఫ్యూయెల్ సిస్టంని బ్లీడ్ చెయ్యండి.
  3. స్టార్ట్ చేస్తున్నప్పుడు, స్టార్టర్ మోటర్ని 15 సెకన్ల కన్నా ఎక్కువ క్రాంక్ చెయ్యకండి. ప్రతి క్రాంకింగ్ కి మధ్య 10 సెకన్ల విరామం ఇవ్వండి, తద్వారా స్టార్టర్ మోటర్ కి డేమెజ్ జరగదు.
  4. టర్బో ఛార్జర్ ఆయుష్షుని పెంచేందుకు, స్టార్టింగ్ లో వెంటనే ఇంజన్ని ఆక్సెల రేట్ చెయ్యకండి మరియు ఇంజన్ని ఆపేసే ముందు, దాన్ని ఐడిల్ లో కనీసం 2 నిమిషాలు ఉంచండి.
  5. ప్రైమరీ ఎయిర్ ఫిల్టర్ని 50 గంటలప్పుడు లేదా క్లస్టర్ పై వార్నింగ్ వచ్చినప్పుడు, తప్పకుండా శుభ్రం చెయ్యాలి.
  6. ఎయిర్ ఫిల్టర్ని శుభ్రం చేసేటప్పుడు, ఎల్లప్పుడు లోపల్నుంచి బయటకు బ్లో చెయ్యండి మరియు ఎప్పుడు ఫిల్టర్ పైన ట్యాప్ చెయ్యకండి, ఎందుకంటే, ఫిల్టర్ డామేజ్ అవవచ్చు మరియు ఇంజన్ ఫెయిల్యుర్ కి దారి తియ్యవచ్చు.
  7. మాన్యుఫాక్చర్ సిఫార్సు చేసిన విరామాలలో, ప్రైమరీ మరియు సెకండరీ ఎయిర్ ఫిల్టర్స్ ని రీప్లేస్ చెయ్యండి. మహీంద్రా EarthMaster కి, ప్రైమరీ మరియు సెకండరీ ఎయిర్ ఫిల్టర్స్ రెండింటికీ, ఛేంజ్ ఇంటర్వెల్ 1000 గంటలు.
  8. ఇంజన్ ఆయిల్ ప్రెషర్ డ్రాప్ అయితే, ఏవైనా ఎక్స్ టర్నల్ లీకేజులు ఉన్నాయా అని, ఇంజన్ ఆయిల్ లెవల్ని పరీక్షించండి. ఒక వేళ ఆయిల్ లెవల్ కనక తక్కువగా ఉంటే, ఆయిల్ లెవల్ని టాప్ అప్ చెయ్యండి మరియు ఒకవేళ ఆయిల్ లెవల్ కనక ఎక్కువగా ఉంటే, డీజెల్ ఇంజన్ ఆయిల్ తో కలిసిందని సూచిస్తుంది. ఒకవేళ ఈ ప్రాబ్లం అలాగే ఉంటే, అధీకృత డీలర్ని పిలవండి.
  9. ఒకవేళ టాప్ అప్ అయినా కూడా, ఇంజన్ ఆయిల్ ఇండికేటర్ ‘లో’’ చూపిస్తూ ఉంటే, డిఫెక్టివ్ ఎలెక్ట్రికల్ కనెక్షన్స్ లేదా ఇంజన్ ఫిల్టర్ క్లాగింగ్ లేదా ఇంజన్ ఆయిల్ కూలర్ క్లాగింగ్ కై పరీక్షించండి.
  10. కేవలం ఇంజన్ చల్లగా ఉన్నప్పుడే, ఎల్లప్పుడూ ఇంజన్ కూలెంట్ లెవల్ని చెక్ చెయ్యండి.
  11. ఇంజన్ని ఐడిల్ లో రన్ చేసి, ట్రాన్స్ మిషన్ ఆయిల్ కోల్డ్ గా ఉన్నప్పుడే ట్రాన్స్ మిషన్ ఆయిల్ లెవల్స్ ని చెక్ చెయ్యాలి. ఈ కేసులో ట్రాన్స్ మిషన్ ఆయిల్ లెవల్, డిప్ స్టిక్ పైన "MAX" మరియు "MIN" మార్క్స్ కి మధ్య ఉండాలి.
  12. ఇంజన్ కాంపొనెంట్ల ఆయుష్షు పెంచేందుకై, ఇంజన్ సర్వీస్ ని పూర్తి చేసిన తర్వాత 10 సెకన్ల పాటు ఇంజన్ని ఎల్లప్పుడూ డెడ్ క్రాంక్ చెయ్యండి. ఇందువల్ల స్టార్టింగ్ కి ముందు, ఇంజన్ కాంపొనెంట్లకు తగినంత ల్యూబ్రికేషన్ ఉంటుందని రూఢి అవుతుంది.

"మా స్ట్రాటజీ, ఇండస్ట్రీలోని అత్యుత్తమ కస్టమర్ సపోర్ట్ ని అందజేయడం-కస్టమర్ని మా బిజినెస్ కి కేంద్రంగా చేయడం’’