Heavy Earth Moving Equipments - Mahindra Construction Equipment
with you hamesha - 1800 209 6006
with you hamesha - 1800 209 6006 


ఉత్పాదనలు మరియు పరిష్కారాలు

మహీంద్రా నిర్మాణ సామగ్రి - ఉత్పత్తి వర్గం

ఏళ్ల తరబడి, భారతదేశంలో కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ అలాగే ఉంటూ వచ్చింది. కానీ ప్రపంచంలో టెక్నాలజీ మాత్రం ఎంతో వేగంగా మారుతూ వచ్చింది. ఎదుగు తున్న ఇంధనపు ఖర్చులు మరియు పెరుగుతున్న ఆపరేషనల్ ఖర్చులతో, కస్టమర్ల లాభదాయకత తగ్గింది. భారతదేశంలో ప్రముఖ ఆటోమోటివ్ మరియు ట్రాక్టర్ మాన్యుఫాక్చరర్ అయిన మహీంద్రా వద్ద మా డిజైనర్లు ప్రస్తుత సినేరియోని చూసి, మా స్వంత, భారతీయ వాడుక పోకడలకై ప్రత్యేకించి తామే డిజైన్ చేసిన కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్‌ కోసం టెక్నాలజీలో గొప్ప ముందంజ వేశారు.

మహీంద్రా EarthMaster

మహీంద్రా వద్ద డిజైనర్లు టెక్నాలజీని మరో స్థాయికి తీసుకువెళ్లారు. ప్రస్తుతపు సినేరోయోని చూస్తూ, మేము బ్యాక్ హో లోడర్ కేటగిరీలో, కొత్త ఎర్త్‌మాస్టర్ SX & VX లను సృష్టించడం ద్వారా ఒక పెద్ద అడుగు వేశాము. ఈ రెండూ కూడా భారతీయ వాడుక పోకడలకు అనువుగా ఉండేట్లు మరియు బ్యాక్ హో లోడర్ కేటగిరీలోని పాత నియమాలను అన్నింటినీ ఉల్లంఘించేట్లు డిజైన్ చెయ్యబడ్డాయి. ఒక 55 kW (74 HP), CRDI మహీంద్రా ఇంజన్‌తో, బెస్ట్ ఇన్ క్లాస్ సామర్థ్యతతో మరియు ఆప్టిమల్ బ్యాక్ హో పర్ఫార్మెన్సుతో, EarthMaster SX & VX లు మీకు అద్భుతమైన ఆదాలను కూడా అందజేయగలవు.

మహీంద్రావారి ఉత్తరదాయిత్వం భారతదేశపు స్వాతంత్య్రానికి ముందు నుంచీ ఉంటూ వచ్చింది. భారతదేశంలో రవాణా పరిశ్రమని విప్లవాత్మకంగా మార్చే చరిత్రను చూస్తే, మహీంద్రావారు మరొకసారి, ఎర్త్‌మాస్టర్ తో ఒక బ్రహ్మాండమైన సాహసకృత్యం చేశారు. ఎర్త్‌మాస్టర్ SX & VX భారతదేశంలో తయారు చేయబడ్డాయి. వాళ్ల ఇంజన్లన్నీ నాగపూర్ లో మాన్యుఫాక్చర్ చెయ్యబడుతున్నప్పటికీ, మిగతా మెషీన్లన్నీ పూణే దగ్గర ఉన్న చాకణ్ ప్లాంట్ లో నిర్మించబడి, అసెంబుల్ చెయ్యబడతాయి. ఇవన్నీ మన జాతీయ మెషీన్లు, ప్రపంచస్తరమైన అగ్రెగేట్స్ తో, ఇవి భారతీయ కస్టమర్లు మరియు వారి అవసరాలపై విస్తారమైన పరిశోధన చేసిన తర్వాత, సృష్టించబడ్డాయి.

భారతదేశంలో బాగా స్థిరపడిన బ్రాండ్ మరియు పది ఏళ్ళ ముందు లాంచ్ చేసినప్పట్నుంచీ 5000+ సంతృప్తి చెందిన భారతీయ కస్టమర్లు ఉన్నారు. ఇది భారతదేశానికై, భారత దేశంలో, భారతీయులచే తయారు చెయ్యబడింది కాబట్టి, భారతదేశ నిర్మాణంలో గత 10 ఏళ్లుగా తోడ్పడుతూ వస్తోంది.

మోడల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మహీంద్రా RoadMaster

భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో, రోడ్లలో 75%, విస్తారం చేస్తున్న ప్రాజెక్టులు ఉంటాయి లేదా గ్రామీణ/ పాక్షిక పట్టణ ప్లాన్లు ఉంటాయి, ఇక్కడ ఉత్పాదకత ఆప్టిమైజ్ చెయ్యబడుతుంది. ఒక సంవత్సరం పొడుగునా భారతీయ రోడ్లపైన, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన చేసిన క్షుణ్ణమైన అధ్యయనంతోను, 20 000+ రోజుల ప్రోడక్ట్ డెవలప్ మెంట్ మరియు 6000+ విస్తారమైన పరీక్షలను దేశమంతటా వివిధ ప్రాంతాలలో చేసిన తర్వాత, భారతదేశాన్ని అభివృద్ధి చెయ్యడంలో తోడ్పడేవి మహీంద్రావారి మోటర్ గ్రేడర్స్. 13 రాష్ట్రాలలోని రోడ్ కాంట్రాక్టర్లు మరియు ఇతర ఎకో సిస్టంలు ఇందులో ప్రమేయం కలిగి ఉన్నాయి. 5000+ దృఢమైన మహీంద్రా R&D యూనిట్ చేత డిజైన్ చెయ్యబడినది.

మహీంద్రావారి ప్రపంచస్తరమైన చాకణ్ ప్లాంట్ లో మాన్యుఫాక్చర్ చెయ్యబడుతుంది. ముఖ్యమైన స్ట్రక్చరల్ కాంపొనెంట్లకై, రోబోటిక్ వెల్డింగ్ టెక్నాలజీ వాడబడుతుంది.

మోడల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి